News12th Jan 01:09 PMSunil Byrisetty1 min read
గోదావరి పాయల్లో కేరళ తరహా పడవ పోటీ
గోదావరి పంట కాలువలో కేరళ తరహా పడవ పోటీల నిర్వహణకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. తెలుగు
గోదావరి పంట కాలువలో కేరళ తరహా పడవ పోటీల నిర్వహణకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కేరళ తదితర రాష్ట్రాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. లొల్ల లాకుల నుంచి ఉచ్చిలికి మధ్య సాగనున్న ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు బరిలో ఉన్నారు. 13వ తేదీ గాలిపటాల పోటీలు జరగనున్నాయి. డ్రాగన్ పడవల పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్ర, కేరళ ఇతర రాష్ట్రాల నుంచి 250 మందితో 25 జట్లు పాల్గొంటున్నాయి. 300 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు, 100మంది గాలిపటాల పోటీల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు. ఆత్రేయపురం మహాత్మాగాంధీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సినీ ఆర్కెస్ట్రా, నారీ నారీ నడుమ మురారి లాంచింగ్‌కు ప్రసిద్ధ సినీనటుడు శర్వానంద్ రానున్నారు. మూడు రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.