Spiritual10th Aug 04:29 PMSunil Byrisetty1 min read
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లికి ఎంపీ సతీమణి బోనం
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలపై ఎల్లప్పుడూ వుండాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి జానకి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించిన
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలపై ఎల్లప్పుడూ వుండాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి జానకి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజవర్గం చుట్టుగుంట ప్రాంతంలో ఆదివారం జరిగిన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి 37వ బోనాల సంబరాల్లో కేశినేని జానకి లక్ష్మీ పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. కేశినేని జానకి లక్ష్మీ ఆలయంలో ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో విజయవాడ నగరం మరింతగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.