News30th Aug 02:52 PMSunil Byrisetty1 min read

ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో ప్రారంభం

విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పోను ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ప్రారంభించారు. స్టాల్స్ ను సందర్శించి చీరలను పరి

ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో ప్రారంభం
విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పోను ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ప్రారంభించారు. స్టాల్స్ ను సందర్శించి చీరలను పరిశీలించారు. స్టాల్స్ లోని వీవ‌ర్స్ తో చేనేత చీర‌ల వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత వ‌స్త్రాలు సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తాయన్నారు. మహిళలకు చీరలంటే ఎంతో మక్కువని, ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ ఎంతో బాగున్నాయని పేర్కొన్నారు. చేనేత వ‌స్త్రాల‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దసరా, దీపావళి పండుగల నేపధ్యంలో ప్రజలు షాపింగ్ చేసి ఎగ్జిబిషన్ ను ఆదరించాలని కోరారు. చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యంతో పాటు మన కళను ప్రోత్సహించినట్లు ఉంటుందని జానకి వివరించారు.
Andhra Pradesh News
Vijayawada
Indian Silk Gallery Expo
Kesineni Janaki Lakshmi
Kesineni Sivanath Chinni
Handloom Sarees
Weavers
ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో ప్రారంభం
Scroll for the next article