Politics5th May 03:34 PMSunil Byrisetty1 min read

బెజవాడలో చల్లారని కేశినేని నాని Vs కేశినేని చిన్ని!

విజయవాడలో అన్నాదమ్ముల సవాళ్లు నడుస్తున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని, తన అన్న కేశినేని నాని మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మరోసారి కేశినేని నాని ట్విట్టర్ల

బెజవాడలో చల్లారని కేశినేని నాని Vs కేశినేని చిన్ని!
విజయవాడలో అన్నాదమ్ముల సవాళ్లు నడుస్తున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని, తన అన్న కేశినేని నాని మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మరోసారి కేశినేని నాని ట్విట్టర్లో సంచలన పోస్టు చేశారు. మరోసారి చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, దిలీప్ పైలాతో కేశినేని చిన్నికి సంబంధం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. మరోవైపు కేశినేని నాని కావాలనే పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ చిన్ని మండిపడ్డారు. నానికి సత్తా ఉంటే తనకు, కేసిరెడ్డి మధ్య ఆర్థికలావాదేవీలు నిరూపించాలని సవాల్ చేశారు. తమ సంస్థ సరిహద్దులో కేసిరెడ్డి సంస్థ ఉండేదని, 2021లో ఉమ్మడిగా ప్రైడ్ ఇన్ఫ్రా రిజిస్టర్ చేశామని వివరించారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఇద్దరం దూరమయ్యామని స్పష్టం చేశారు. అయినా అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ ఆరోపిస్తున్నారని చిన్ని పేర్కొన్నారు.
YSRCP
AP Politics
Kesineni Nani
Kesineni Chinni
అన్నాదమ్ముల సవాళ్లు
ఎంపీ కేశినేని చిన్ని తన అన్న కేశినేని నాని మధ్య ఆరోపణలు
కేశినేని నాని ట్విట్టర్లో సంచలన పోస్టు
Scroll for the next article