News22nd Jul 01:17 PMSunil Byrisetty1 min read

రైల్వే బోర్డ్ చైర్మ‌న్ కు ఎంపీ కేశినేని విజ్ఞ‌ప్తి

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అమృత భార‌త స్టేష‌న్ 2.0 ప‌థ‌కం కింద విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ అభివృద్దికి నీతి ఆయోగ్ మంజూరు

రైల్వే బోర్డ్ చైర్మ‌న్ కు ఎంపీ కేశినేని విజ్ఞ‌ప్తి
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అమృత భార‌త స్టేష‌న్ 2.0 ప‌థ‌కం కింద విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ అభివృద్దికి నీతి ఆయోగ్ మంజూరు చేసిన నిధుల‌ను రైల్వే శాఖ ద్వారా త్వ‌రిత‌గ‌తిన విడుద‌ల చేయించాల‌ని రైల్వే బోర్డ్ చైర్మ‌న్ స‌తీష్ కుమార్ కు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో రైల్వే బోర్డ్ చైర్మ‌న్ స‌తీష్ కుమార్ ను రైల్ భ‌వ‌న్ లోని ఆయ‌న‌ కార్యాల‌యంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ క‌లిశారు. ఈ సంద‌ర్బంగా రైల్వే బోర్డ్ చైర్మ‌న్ స‌తీష్ కుమార్ ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ శాలువాతో స‌త్క‌రించారు. అనంతరం విజ‌య‌వాడ రైల్వే డివిజన్ పరిధిలో నెల‌కొన్న‌ స‌మ‌స్య‌లను రైల్వే బోర్డ్ చైర్మ‌న్ స‌తీష్ కుమార్ వద్ద ప్ర‌స్తావించారు. విజయవాడ రైల్వే డివిజన్‌లో పెండింగ్ లో వున్న లెవెల్ క్రాసింగ్ నెం. 316 (విజయవాడ – గుణద‌ల), లెవెల్ క్రాసింగ్ నెం. 147 (రాయనపాడు – కొండపల్లి), లెవెల్ క్రాసింగ్ నెం. 148 (విజయవాడ – రాయనపాడు), లెవెల్ క్రాసింగ్ నెం.8 (విజ‌య‌వాడ -రామ‌వ‌ర‌ప్పాడు), వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (RoBs) , రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు (RuBs) నిర్మాణ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విన్న‌వించారు.
Andhra Pradesh news
Kesineni Sivanath
Vijayawada Railway Division
Railway Board Chairman Satish Kumar
Amrit Bharat Station Scheme
NITI Aayog Funds
Railway Infrastructure
Level Crossings
Road Over Bridges
విజయవాడ రైల్వే డివిజన్
అమృత భారత్ స్టేషన్ పథకం
Scroll for the next article