Politics6th Sep 12:58 PMSunil Byrisetty1 min read

తాడిపత్రికి పెద్దారెడ్డి – కండిషన్స్ అప్లై!

వైయస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య తాడిపత్రికి చేరుకున్నారు. భద్రతకు అయ్యే ఖర్చు తానే పెట్టుకుంటానని సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వడంతో ఆమోదంత ల

తాడిపత్రికి పెద్దారెడ్డి – కండిషన్స్ అప్లై!
వైయస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య తాడిపత్రికి చేరుకున్నారు. భద్రతకు అయ్యే ఖర్చు తానే పెట్టుకుంటానని సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వడంతో ఆమోదంత లభించింది. మూడు వందల పోలీసుల భద్రతకు అయ్యే ఖర్చును పెద్దారెడ్డి పెట్టుకుని మరీ తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. తాడిపత్రికి వెళ్లడానికి గతంలో హైకోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అని పోలీసులు చెప్పడంతో, భద్రతా ఖర్చు తానే పెట్టుకుంటానని పెద్దారెడ్డి చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లభించింది. అయితే తాడిపత్రిలో ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టించవద్దని.. రాజకీయ పరమైన, రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా చూసేలా పెద్దారెడ్డి అంగీకరించారు.
Andhra News
YSRCP
AP Politics
Peddareddy
Tadipatri
Supreme Court
Andhra Pradesh Politics
YCP
తాడిపత్రి
సుప్రీంకోర్టు
భద్రతా ఖర్చు
Scroll for the next article