Politics30th Jun 04:28 PMSunil Byrisetty1 min read

తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిగా మారింది.

తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తమ ఫిర్యాదును అందజేశారు. కేతిరెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు తనను తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. "నన్ను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. నాకు భద్రత కల్పించాలని రెండు నెలల క్రితమే ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అయినా ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదు" అని ఆయన తెలిపారు.
Andhra Pradesh news
Tadipatri
Ap politics
Ycp
Political Clash
Ap police
kethireddy pedda
reddy
jc prabhakar reddy
తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి
Scroll for the next article