News6th Aug 10:54 AMSunil Byrisetty1 min read

కేబినెట్లో కీలక అంశాలు

ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం

కేబినెట్లో కీలక అంశాలు
ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతడక గ్రామంలో 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల ఇనాం భూములను దేవాదాయ శాఖ నుంచి సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు రూ.122 కోట్ల చెల్లింపునకు ఓకే చెప్పనున్నారు. ఇక, హ్యాపీ నెస్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ రెరాకు చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజును రద్దు చేసే ప్రతిపాదనపైనా చర్చించనున్నారు. అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో 5జీ సెల్ టవర్ల ఏర్పాటు కోసం టెండర్లకు ఆహ్వానం తదితర పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
AP Cabinet
Andhra Pradesh
Chandrababu Naidu
Amaravati
CRDA
Amaravati Development
Land Pooling
మోతడక
పల్నాడు
హ్యాపీ నెస్ట్
ఏపీ రెరా
డేటా సెంటర్లు
5జీ టవర్లు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్
Scroll for the next article