Jobs6th Jan 12:52 PMSunil Byrisetty1 min read
జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన
తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల విస్తరణతో రాష్ట్రంలో వేలాది కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఐటీ, పరి
తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల విస్తరణతో రాష్ట్రంలో వేలాది కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. అదే సమయంలో, నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జాబ్ క్యాలెండర్’ రూపకల్పనలో సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అందుకే కొంత సమయం పడుతోందని ఆయన స్పష్టం చేశారు. పోచారంలోని ఇన్ఫోసిస్ సంస్థ విస్తరణ ద్వారా ఏకంగా 17,000 మందికి ఉపాధి లభించనుంది.
విప్రో సంస్థ విస్తరణ ద్వారా మరో 5,000, కొత్తగా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్ సంస్థ ద్వారా ఇంకో 5,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అలాగే హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థలు కూడా చెరొక వెయ్యి ఉద్యోగాలను సృష్టించనున్నాయి.