Education20th Oct 10:05 AMSunil Byrisetty1 min read
ఇంటర్ మార్కుల విధానంలో కీలక మార్పులు!
ఏపిలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మార్కుల విధానంలో మార్పులు తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అభ్యర్థి ప్రతి పేపర్లో కనీసం 30% మార్కులు, ఒకే ప్రయత్నంలో 35% సరాసరి మార్
ఏపిలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మార్కుల విధానంలో మార్పులు తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అభ్యర్థి ప్రతి పేపర్లో కనీసం 30% మార్కులు, ఒకే ప్రయత్నంలో 35% సరాసరి మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా ప్రకటించనుంది. దీనివల్ల ఏదైనా సబ్జెక్టులో 30 మార్కులే వచ్చినా, మిగిలిన వాటిలో 35 కన్నా ఎక్కువ వచ్చి సగటు 35 మార్కులు దాటితే పాస్ అవుతారు. తద్వారా అభ్యర్థులు సప్లిమెంటరీ రాయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అలాగే
మొదటి, రెండో సంవత్సరం సబ్జెక్టుల వారీగా గరిష్ట, కనిష్ట మార్కుల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.