Spiritual2nd Jan 02:25 PMSunil Byrisetty1 min read
కనకదుర్గమ్మ ఆలయంలో కీలక నిర్ణయం
వీఐపీల విషయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీఐపీ, వీవీఐపీలు దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశార
వీఐపీల విషయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీఐపీ, వీవీఐపీలు దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రోజుకు 200 నుంచి 300 మంది వీఐపీ, వీవీఐపీలు సిఫార్సు లెటర్లతో టికెట్ లేకుండా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో దృష్టికి వెళ్లింది. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతున్నట్టు గుర్తించారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.