News11th Sep 04:26 PMSunil Byrisetty1 min read

నేతన్న భరోసా పెన్షన్ లో కీలక నిబంధన మినహాయింపు

నూతన నేతన్న భరోసా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేతలకు ఊరటనిచ్చేలా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు బ్య

నేతన్న భరోసా పెన్షన్ లో కీలక నిబంధన మినహాయింపు
నూతన నేతన్న భరోసా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేతలకు ఊరటనిచ్చేలా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు బ్యాంకు స్టేట్ మెంట్ అందజేయాల్సిన అవసరం లేదని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు తీసుకున్న వివరాలు అందజేస్తే సరిపోతుందన్నారు. అన్ని రకాల పెన్షన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల ఏడో తేదీ నుంచి వృద్ధ్యాప్యం, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత సహా అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. నేతన్న భరోసా పెన్షన్ కు దరఖాస్తు చేస్తుకుంటున్న నేతన్నలకు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధన ఇబ్బందిగా మారింది. మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసే చేనేతలకు వ్యక్తిగతంగానే వేతనాలు చెల్లిస్తూ వస్తుంటారు. అటువంటి సమయంలో బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధన పెట్టడంతో చేనేతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇదే విషయమై పలువురు నేతన్నలు, చేనేత సంఘాల ప్రతినిధులు మంత్రి సవిత దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. తక్షణమే ఆమె స్పందించి, సీఎం చంద్రబాబు దృష్టికి చేనేతల సమస్యను తీసుకెళ్లారు. బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధనను సడలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో, అర్హులైన చేనేతలందరికీ నేతన్న భరోసా పెన్షన్లు అందజేసే అవకాశం కలిగింది.
Andhra Pradesh Government
Nethanna Bharosa Pension
Handloom Weavers
S Savitha
Chandrababu Naidu
Handloom Pension
Weaver Welfare
Pension Scheme
ఏపీ సంక్షేమ పథకాలు
చేనేత కార్మికుల సమస్యలు
నేతన్న భరోసా
పెన్షన్ దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article