News12th Jul 01:45 PMSunil Byrisetty1 min read

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు, సమస్యలను పర

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, డీలిమిటేషన్ కమిషన్ చట్టం కాలేదని పేర్కొన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని, అందుకే కొందరు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని తీసుకొస్తామని, పార్లమెంట్‍లో డీలిమిటేషన్‍పై చర్చిస్తామని చెప్పారు. పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
India news
Delhi
Union Home Minister Amit Shah
delimitation Commission
Tamilnadu
పునర్విభజన కమిషన్
డీలిమిటేషన్ కమిషన్ చట్టం
Scroll for the next article