News7th Aug 04:56 PMSunil Byrisetty1 min read
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, హయ్యర్ పెన్షన్ అంశాలపై పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి కీలక మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, హయ్యర్ పెన్షన్ అంశాలపై పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. పీఎఫ్ కమిషనర్ తో ఆర్టీసీ వీసీ & ఎండీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్, పెన్షన్ సమస్యలపై సమగ్రంగా చర్చించారు. 60 సంవత్సరాల వయస్సు వరకు వసూలు చేసిన EPS చందాల రీఫండ్, పెన్షన్ పునర్నిర్ణయం, 2,860 మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ మంజూరు తదితర అంశాలను వివరంగా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి సమస్యను నిబంధనల మేరకు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత పెండింగ్ కేసులను వేగవంతంగా పరిశీలించాలని పి.ఎఫ్. అధికారులకు సూచించారు.