Politics13th Oct 02:04 PMSunil Byrisetty1 min read

స్థానికంపై కీబోర్డ్ వారియర్స్ అత్యుత్సాహం

ఏపీలో కీబోర్డ్ వారియర్స్ అత్యుత్సాహం ఎన్డీయే పార్టీల క్షేత్రస్థాయి నాయకుల మధ్య గ్యాప్ పెంచుతోంది. అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు , పవన్ కల్యాణ్ పరిపాలనాపరంగా ఎలాంటి విభ

స్థానికంపై కీబోర్డ్ వారియర్స్ అత్యుత్సాహం
ఏపీలో కీబోర్డ్ వారియర్స్ అత్యుత్సాహం ఎన్డీయే పార్టీల క్షేత్రస్థాయి నాయకుల మధ్య గ్యాప్ పెంచుతోంది. అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు , పవన్ కల్యాణ్ పరిపాలనాపరంగా ఎలాంటి విభేదాలు లేవు. కానీ సోషల్ మీడియా వేదికలపై మాత్రం నిత్యం అగ్గి రాజేస్తూనే ఉంది. ఇరు పార్టీల అధినేతలు భేటీ అవుతూ సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పటికీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రెండు పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరులు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. పవన్ కల్యాణ్ ఏదైనా వ్యాఖ్య చేసిన తర్వాత టీడీపీ సోషల్ మీడియా విభాగాలు భావోద్వేగాలతో రియాక్ట్ కావడం, దానికి ప్రతిగా జనసేన సైనికులు గత త్యాగాలను గుర్తుచేస్తూ విరుచుకుపడటం పరిపాటిగా మారింది. 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారైన వేళ.. ఏ సీటు తమకే దక్కాలి, ఎవరు ఎక్కడ త్యాగం చేయాలనే దానిపై సోషల్ మీడియాలోనే ఎవరికి వారే జాబితాలు విడుదల చేసుకుంటున్నారు. విజయవాడ, విశాఖ, కాకినాడ మేయర్ సీట్లతో పాటు కీలక మున్సిపాలిటీలను జనసేనకే ఇవ్వాలని కొందరు, టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు ప్రకారం మెజారిటీ స్థానాలు తమకే ఉండాలని మరికొందరు సొంత సిద్ధాంతాలు వండి వారుస్తున్నారు.
Scroll for the next article