Politics20th Jun 02:32 PMSunil Byrisetty1 min read
జగన్ వ్యాఖ్యలపై KGF ఖండన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కమ్మ సంఘాలు తీవ్ర అభ్యంత
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కమ్మ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) తీవ్రంగా ఖండిస్తూ, జగన్‌ను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించింది.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ జగన్ పల్నాడులో ఆత్మహత్య చేసుకున్న తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం మానవత్వం గల చర్యగా అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ, కమ్మ సామాజిక వర్గాన్ని అవమానించేలా, అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేయడం ఖండనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్‌ను హెచ్చరిస్తున్నామని KGF నాయకులు తెలిపారు.