Telangana2nd Oct 12:12 PMSunil Byrisetty1 min read

'ఖైరతాబాద్‌'పై ఊహించని మలుపు

ఖైరతాబాద్‌ ఉపఎన్నిక వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి కుమార్తె పీ విజయారెడ్డి గతంలో దాఖలు చే

'ఖైరతాబాద్‌'పై ఊహించని మలుపు
ఖైరతాబాద్‌ ఉపఎన్నిక వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి కుమార్తె పీ విజయారెడ్డి గతంలో దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకూ ఉపఎన్నిక నిర్వహించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు న్యాయవాది కూడా దీనికి అంగీకరించారు. ఈమేరకు, తీర్పు వెలువడేవరకూ ఉపఎన్నిక నిర్వహించబోమంటూ ఈసీ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ మారినట్లు నిరూపణ కావడంతో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌ ఫిరాయింపుల చట్టం ప్రకారం పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. ఫలితంగా ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో విజయారెడ్డి పిటిషన్‌తో ఒక్కసారిగా ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడినట్లయింది.
Scroll for the next article