Telangana25th Sep 11:49 AMSunil Byrisetty1 min read

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఎక్కడా ఆగకుండా ఖైరతాబాద్‌ మహాగణపతి ముందుకు సాగుతున్నారు. నిమజ్జనానికి తరలిన వినాయకుడి దర్శనానికి భారీగా జనం తరలి వచ్చారు. దారంతా భవనాల పై

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర
ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఎక్కడా ఆగకుండా ఖైరతాబాద్‌ మహాగణపతి ముందుకు సాగుతున్నారు. నిమజ్జనానికి తరలిన వినాయకుడి దర్శనానికి భారీగా జనం తరలి వచ్చారు. దారంతా భవనాల పై నుంచి భక్తులు పూలు జల్లుతున్నారు. భక్తులు ముందుకు రాకుండా నిర్వాహకులు చూసుకుంటున్నారు. డ్రోన్‌ల ద్వారా పరిస్థితుల్ని పోలీసులు గమనిస్తున్నారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేశారు. క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గరే నిమజ్జనం చేసేందుకు మధ్యాహ్నాం 2 గంటలకల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చూస్తున్నారు.
Scroll for the next article