News21st Oct 01:21 PMSunil Byrisetty1 min read

ఖాకీ అంటే బాధ్యత-పోలీసు అంటే భరోసా

ప్రజారక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన వారికి సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాతృభూమి రక్షణ, ప్రజారక్షణ

ఖాకీ అంటే బాధ్యత-పోలీసు అంటే భరోసా
ప్రజారక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన వారికి సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాతృభూమి రక్షణ, ప్రజారక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని గౌరవించుకునే సందర్భమిదని పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ 10 మంది పోలీసులు వీరమరణం పొందారని, దానికి గుర్తుగా ఇదే రోజును పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామని వివరించారు. ఖాకీ అంటే బాధ్యత-పోలీసు అంటే భరోసా అని, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసు వృత్తి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో, నేరాలను ఛేదించడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉందని పేర్కొన్నారు.
Scroll for the next article