Sports8th Mar 02:06 PMSunil Byrisetty1 min read
ఖేలో ఇండియాతో క్రీడలకు మహర్దశ
ఏపీలో ఖేలో ఇండియా పథకంతో క్రీడా రంగానికి మహర్దశ పట్టనుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునీకరణకు ₹27.48 నిధులు
ఏపీలో ఖేలో ఇండియా పథకంతో క్రీడా రంగానికి మహర్దశ పట్టనుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు.
విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునీకరణకు ₹27.48 నిధులు, పలు ప్రాజెక్టులకు, క్రీడా మౌలిక సదుపాయాలు కల్పనకోసం నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు.
రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి ₹42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టు సహకారం అందించాలని ప్రతిపాదించారు.
రాయచోటిలో జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి మంసుఖ్ మాండవీయను అభ్యర్థించారు.