Health3rd Aug 03:41 PMSunil Byrisetty1 min read
విజయవాడలో కిడ్నీ అవేర్నెస్ కార్యక్రమం
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయం విజయవాడలో కిడ్నీ అవేర్నెస్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రముఖ మూత్రపిండాల వ్యాధి నిపుణులు (నెఫ్
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయం విజయవాడలో కిడ్నీ అవేర్నెస్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రముఖ మూత్రపిండాల వ్యాధి నిపుణులు (నెఫ్రాలజిస్ట్) డా. మొహమ్మద్ షోహెబ్ అహ్మద్ ఖాన్ చే నిర్వహించారు. డాక్టర్ అంటే వైద్యం అందించడం మాత్రమే కాదు, వ్యాధి నిరోధక అవగాహన కలిగించాలని డా. మొహమ్మద్ షోహెబ్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడమే కాకుండా పలు అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు వైద్య సలహాలు, సూచనలు అందించారు. మనం సాఫ్ట్ డ్రింక్స్ గా భావించే కూల్ డ్రింక్స్ కిడ్నీకు బద్ధ శత్రువు అని వివరించారు.