News9th Aug 10:00 AMSunil Byrisetty1 min read

మహిళా సాధికారతకు కిరణ్ బేడీ పాఠాలు!

మహిళలు ఆర్థిక స్వతంత్రాన్ని కలిగి ఉండటం అత్యంత కీలకమని, స్వయం సమృద్ధి ద్వారానే మహిళా సాధికారత సాధ్యపడుతుందని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. కిరణ్

మహిళా సాధికారతకు కిరణ్ బేడీ పాఠాలు!
మహిళలు ఆర్థిక స్వతంత్రాన్ని కలిగి ఉండటం అత్యంత కీలకమని, స్వయం సమృద్ధి ద్వారానే మహిళా సాధికారత సాధ్యపడుతుందని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. కిరణ్ బేడీ ఉద్ఘాటించారు. విజయవాడలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. వ్యాపార, ఆర్థిక నిర్వహణను ఇతరులకు అప్పగించకుండా మహిళలే స్వయంగా తమ ఆర్థిక విషయాలపై పట్టు సాధించాలని, ఆర్థిక నిర్ణయాధికారం తమ చేతుల్లోనే ఉంచుకోవాలని సూచించారు. సమాజంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
India
Kiran Bedi
Women Empowerment
Financial Independence
Women’s Rights
Self Reliance
Women Entrepreneurs
Cyber Crime Awareness
ఆర్థిక అక్షరాస్యత
మహిళా సదస్సు
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
భారతదేశంలో మహిళలు
సామాజిక అభివృద్ధి
Scroll for the next article