Politics18th Mar 07:01 PMSunil Byrisetty1 min read

యాంకర్ శ్యామలపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై జనసేన నుంచి సస్పెండైన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆరోపించారు. యాంకర్ శ్యామలపైనా చర

యాంకర్ శ్యామలపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై జనసేన నుంచి సస్పెండైన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆరోపించారు. యాంకర్ శ్యామలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుందని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. యాంకర్ శ్యామలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే శ్యామలని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేశాకే వైసీపీ వాళ్లు మాట్లాడాలన్నారు. ఆమెపై మర్డర్ కేసు కూడా పెట్టాలన్నారు, శ్యామల ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. శ్యామల అధికార ప్రతినిధి వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్‌కా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఓ మహిళ ఆరోపణల నేపథ్యంలో.. జనసేన తిరుపతి ఇంఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్‌ను.. జనసేన పార్టీ ఆ బాద్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
Kiran royal
YCP Syamala
AP Political news
యాంకర్ శ్యామల
జనసేన
Scroll for the next article