Politics6th Mar 03:53 PMSunil Byrisetty1 min read
పవన్ దగ్గర ఆధారాలతో చూపిస్తానన్న కిరణ్ రాయల్
తనపై ఎవరు కుట్ర చేశారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా అని తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. తాను ఏ తప్పు చేయలేదు అని పవన్ గారికి తెలిసి విచారణ చే
తనపై ఎవరు కుట్ర చేశారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా అని తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు.
తాను ఏ తప్పు చేయలేదు అని పవన్ గారికి తెలిసి విచారణ చేయమన్నారని చెప్పారు. క్లీన్ చిట్‌తో మళ్లీ నేషనల్ హైవేలా దుసుకుపోతా అని ధీమా వ్యక్తం చేశారు.
తన జీవితాంతం పవన్ కళ్యాణ్, మీడియాకు రుణపడి ఉంటానని అని పేర్కొన్నారు.
తనకు, లక్ష్మి రెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.
‘ఏమి జరిగినా నా మంచికే. 26 రోజులు నన్ను తొక్కారు. నేను ఏ తప్పు చేయలేదు అని పవన్ కి తెలిసి విచారణ చేయమన్నారు. .
నేను ఏ తప్పు చేయలేదని కొంతమంది నమ్మారు అది చాలు. నన్ను, నా పిల్లలను హింస పెట్టారు. రాజకీయాలు చేస్తే మానసికంగా తొక్కేశారు.
తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూశారు. నాకు, లక్ష్మి రెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి.
ఒక మహిళను రాజకీయాల్లో లాగి అనేక రకాల్లో హింసకు గురి చేశారు. ఆ మహిళకు ఆర్దికంగా ఆశ చూసి, ఆ మహిళ కొడుకులను బెదిరింపులకు గురి చేశారు.
నేను మండోడిని కాబట్టే నిలబడ్డా.. ఇంకవరైనా కుటుంభం మొత్తం ఆత్మహత్య చేసుకుంటారు.
26 రోజులుగా నా ఫ్యామిలీ బయటకు రాలేదు.
ఒక చైన్ వేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తారా?. వైసీపీలో రాసలీలలు, రాజాలు చాలామందే ఉన్నారు.
వారు నిజాయితీ పరులా?. నాపై ఎవరు కుట్ర చేశారో పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా.
క్లీన్ చిట్‌తో మళ్లీ నేషనల్ హైవేలా దుసుకుపోతా’ అని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.