News2nd Sep 03:07 PMSunil Byrisetty1 min read
రైతులకు కిసాన్ డ్రోన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కిసాన్ డ్రోన్లను రైతులకు పంపిణీ చేస్తోంది. విజయనగరం జిల్లా, జామి మండలం, మొక్కాసవలస గ్రామానికి చెందిన లబ్ధిదారుడు కూనిరెడ్డి సత్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కిసాన్ డ్రోన్లను రైతులకు పంపిణీ చేస్తోంది. విజయనగరం జిల్లా, జామి మండలం, మొక్కాసవలస గ్రామానికి చెందిన లబ్ధిదారుడు కూనిరెడ్డి సత్యనారాయణ మూర్తికి డ్రోన్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందించారు. రూ. 9.8 లక్షల విలువైన ఈ డ్రోన్‌ను రైతులకు 80% సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. ఒక్కో డ్రోన్‌కు ప్రభుత్వం రూ. 8 లక్షల సబ్సిడీని భరిస్తుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద జిల్లాలో మొత్తం 24 డ్రోన్లను పంపిణీ చేయనున్నామని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1.92 కోట్లు సబ్సిడీగా అందిస్తోందని చెప్పారు. వ్యవసాయ పనుల వేగాన్ని పెంచడానికి డ్రోన్ల వినియోగం చాలా అవసరమని, రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.