Education21st Sep 03:29 PMSunil Byrisetty1 min read

ఏఐ క్యాంపస్ గా.. కెఎల్ యూనివర్సిటీ

ఏఐ సమీకృత ఉన్నత విద్యలో ఒక ముఖ్యమైన ముందడుగుగా, కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ, హెచ్‌సీఎల్ గ్రూప్‌ నకు చెందిన హెచ్ సిఎల్ జియు విఐ ఎఐ లాబ్స్ (HCL GUVI AI Labs) తో చేతులు కలిపి, HCL

ఏఐ క్యాంపస్ గా.. కెఎల్ యూనివర్సిటీ
ఏఐ సమీకృత ఉన్నత విద్యలో ఒక ముఖ్యమైన ముందడుగుగా, కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ, హెచ్‌సీఎల్ గ్రూప్‌ నకు చెందిన హెచ్ సిఎల్ జియు విఐ ఎఐ లాబ్స్ (HCL GUVI AI Labs) తో చేతులు కలిపి, HCL GUVI AI Labs సహకారంతో, ఏఐ ఆధారిత డిగ్రీలతో దేశంలోనే తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌”ను ఏర్పాటు చేస్తోంది. ఈ భాగస్వామ్యానికి సంబంధించి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందం (MoU)పై హెచ్ సిఎల్ ప్రతినిధులు సంతకాలు చేశారు. కృత్రిమ మేధ (ఏఐ), ఏజెంటిక్ ఏఐ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి, వాస్తవ వినియోగంలో అమలు చేయడానికి అవసరమైన జ్ఞానం, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడం దీని లక్ష్యం. డిగ్రీ కార్యక్రమాలు, పాఠ్యప్రణాళికలు, ప్రయోగశాలలు, ప్రాజెక్టులు, అభ్యసన కార్యకలాపాల్లో ఏఐని దశలవారీగా సమీకరించనున్నారు. విద్యార్థులు కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పొందుతారు. తద్వారా తమ తమ విద్యా విభాగాల్లో ఏఐని అన్వయించగలుగుతారు.
Scroll for the next article