News23rd Jul 04:10 PMSunil Byrisetty1 min read
మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసిన నాట్స్ ఏరో స్పేస్
ఆర్&బీ, ఐ&ఐ శాఖ కార్యాలయంలో పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని నాట్స్ ఏరో స్పేస్ (KNOTS AERO SPACE PVT LTD) సంస్థ ప్రతినిధి అథిరాజ్ సింగ్ చావ్లా కలిశారు
ఆర్&బీ, ఐ&ఐ శాఖ కార్యాలయంలో పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని నాట్స్ ఏరో స్పేస్ (KNOTS AERO SPACE PVT LTD) సంస్థ ప్రతినిధి అథిరాజ్ సింగ్ చావ్లా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అథిరాజ్ సింగ్ చావ్లా ఆసక్తి వ్యక్తం చేశారు.
పైలట్ శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, దేశీయ, అంతర్జాతీయ స్థాయి శిక్షణ అవకాశాల్లో ఢిల్లీకి చెందిన నాట్స్ ఏరో స్పేస్ సంస్థకు అనుభవం ఉంది. రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ఎయిర్ పోర్టు లేదా కర్నూలు ఎయిర్ పోర్టుల్లో FTO (ప్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్) ఏర్పాటుకు నాట్స్ ఏరో స్పేస్ సంస్థ ముందుకు వచ్చింది. వచ్చే 5 ఏళ్లలో దాదాపు రూ. 100 కోట్ల పెట్టుబడితో 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు, ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు యువతలో అభివృద్ధి చేయవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.