Politics26th Mar 11:52 AMSunil Byrisetty1 min read

కొడాలి నానికి గుండెపోటు.. ఆరోగ్యంపై క్లారిటీ!

వైయస్సార్ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్ర

కొడాలి నానికి గుండెపోటు.. ఆరోగ్యంపై క్లారిటీ!
వైయస్సార్ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా , పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నానికు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ ప్రకటించారు. నాని గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడ్డారని, గ్యాస్ట్రిక్ సమస్యతోనే ఆయన హాస్పటల్లో చేరారని వివరించారు. హాస్పటల్లో కొడాలి నానికు సాధారణ పరీక్షలు చేశారన్నారు. పరీక్షల్లో అంతా సవ్యంగా ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయన్నారని, గుండె పోటు వచ్చినట్లు మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కొడాలి నాని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, గుడివాడ నియోజకవర్గ ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఎవ్వరు ఆందోళన చెందనవసరం లేదని శశిభూషణ్ తెలిపారు.
Appolo
kodali Nani
Health
వైఎస్ఆర్సిపి
Scroll for the next article