Politics10th Dec 03:37 PMSunil Byrisetty1 min read

వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కొడాలి నాని

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్న

వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కొడాలి నాని
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల ప్రతులను జిల్లా పార్టీకి పంపే కార్యక్రమం లింగవరం కే కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని కోటి సంతకాల ప్రతులు వ్యాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేశారన్నారు. వీటిలో ఐదు కళాశాలలను ప్రారంభోత్సవం చేశారని, మరో ఐదు కళాశాలల పూర్తి చేయడం జరిగిందని, వాటిని 2024 ఎన్నికల్లో సందర్భంగా ప్రారంభించలేదని ఎన్నికల అనంతరం ప్రారంభిద్దామని వాయిదా వేసినట్లు కొడాలి నాని చెప్పారు. ఈనెల 17వ తారీఖున కోటి సంతకాల ప్రతులను వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు అందజేస్తామని కొడాలి నాని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేసే విషయంలో పునరా ఆలోచన చేయాలని కొడాలి నాని సూచించారు.
Andhra Pradesh
Kodali Nani
YSRCP
One Crore Signatures Campaign
Medical Colleges Privatization
Chandrababu Naidu
Pawan Kalyan
రాజకీయాలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
వైఎస్ఆర్‌సీపీ నిరసనలు
Scroll for the next article