News1st Apr 09:46 AMSunil Byrisetty1 min read

ముంబైకి కొడాలి నాని.. సీరియస్‌గా ఆరోగ్యం

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని హృద్రోగ సమస్యలతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే గుండెలో ఉండే 4 వాల్వ్ లలో 3 నాళాలు పూడుకుపోవడంతో..

ముంబైకి కొడాలి నాని.. సీరియస్‌గా ఆరోగ్యం
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని హృద్రోగ సమస్యలతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే గుండెలో ఉండే 4 వాల్వ్ లలో 3 నాళాలు పూడుకుపోవడంతో.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కొడాలి నాని ఇటీవల హార్ట్ స్ట్రోక్ తో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో చేరిన సంగతి మీకు తెలిసిందే. అప్పుడే కిడ్నీ సమస్యలు కూడా బయట పడ్డాయి. పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ముంబైకి కొడాలి నానిని ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. కొడాలి నానికి 5 రోజులు హైదరాబాద్ లో చికిత్స అందించినా సర్జరీ చేయలేదు. సర్జరీ పరిస్థితి క్లి్ష్టంగా మారడంతో కొడాలి నానిని ముంబై ఆసుపత్రికి తరలించారు. అయితే మరోవైపు కొడాలి నాని ఆరోగ్యంతో తిరిగి రావాలని గుడివాడ ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు మడిచి పెట్టుకుంటానన్న రెడ్ బుక్‌ను ఏ ప్రదేశంలో పెట్టుకుంటారో ప్రజలకు చూపించాలని సామాన్యుడు పేరుతో నెటిజన్లు పోస్టులు చేస్తు్న్నారు.
Kodalinani
Kodalinani's health condition
Mumbai Hospital
Scroll for the next article