News14th Aug 11:55 AMSunil Byrisetty1 min read

టీటీడీకి డా. కోడెల కుటుంబం రూ. 20 లక్షల విరాళం

పేదలకు వైద్య సేవలు అందిస్తున్న టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి డా. కోడెల కుటుంబం తరఫున రూ.20 లక్షల విరాళం అందించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రస

టీటీడీకి డా. కోడెల కుటుంబం రూ. 20 లక్షల విరాళం
పేదలకు వైద్య సేవలు అందిస్తున్న టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి డా. కోడెల కుటుంబం తరఫున రూ.20 లక్షల విరాళం అందించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా ఆయన మనవళ్లు చిరంజీవి కోడెల గౌతం రూ.10 లక్షలు, చిరంజీవి కోడెల జేయాదిత్య రూ.10 లక్షలు విరాళంగా అందించినట్లు తెలిపారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు డా. కోడెల శివరాం కృష్ణ అందించారు. పేదలకు వైద్య సహాయం అందించేందుకు టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు విరాళం అందించిన డా. కోడెల కుటుంబాన్ని ఈవో అభినందించారు. భక్తులు, దాతలు టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మరింతగా సహకరించాలని ఆయన కోరారు.
Andhra Pradesh
TTD
Tirumala Tirupati Devasthanams
Kodela Family
Kodela Sivaprasad
Kodela Sivaram Krishna
Kodela Gautham
Kodela Jeyaditya
బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని
పేదలకు వైద్యం
ఆరోగ్య సేవలు
తిరుమల
సేవా కార్యక్రమాలు
Scroll for the next article