Politics29th Aug 01:08 PMSunil Byrisetty1 min read

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా హరీష్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన 50వ డివిజన్ కు చెందిన కామరాజ్ హరీష్ కుమార్ ఆచారి విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా హరీష్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన 50వ డివిజన్ కు చెందిన కామరాజ్ హరీష్ కుమార్ ఆచారి విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుని కలిసి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా వెలంపల్లి, కామరాజ్ హరీష్ కుమార్ ఆచారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా పని చేయాలనీ హరీష్ కి సూచించారు. ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తేవాలన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలనీ తెలిపారు. ఈ సందర్భంగా కామరాజ్ హరీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వైసిపి అధికార ప్రతినిధిగా నియమించినందుకు జగన్ మోహన్ రెడ్డికి, వెలంపల్లి శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమస్యలను వెలుగులోకి తెచ్చి కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కడతానని తెలిపారు. పార్టీ అభివృద్ధి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వెన్నం రజిని, గోదావరి బాబు, సోమిశెట్టి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
YSRCP
NTR District
Komaraj Harish Kumar
Velampalli Srinivas Rao
Party Appointment
ys jagan
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా హరీష్
Scroll for the next article