Politics12th Aug 02:00 PMSunil Byrisetty1 min read

మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి అసంతృప్తి

మంత్రి పదవి ఇవ్వకపోవడంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమీకరణాలు కుదరకపోవడమే కారణమని, పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములమని తెలియదా అని

మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి అసంతృప్తి
మంత్రి పదవి ఇవ్వకపోవడంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమీకరణాలు కుదరకపోవడమే కారణమని, పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములమని తెలియదా అని ప్రశ్నించారు. “ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న” అన్న చందంగా ఉందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పేమిటని ప్రశ్నించారు. తాము అన్నదమ్ములు సమర్థులమని, గట్టి వారమని అన్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరగకూడదని, అది తనకు జరిగిన అన్యాయం కంటే పెద్దదని హెచ్చరించారు.
Telangana Politics
Komatireddy Rajgopal Reddy
BJP
Minister Post Controversy
Nalgonda
Khammam
Munugode
మంత్రి పదవి వివాదం
రాజకీయ విమర్శలు
Scroll for the next article