News9th Jun 01:59 PMSunil Byrisetty1 min read
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు
సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్
సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకువెళ్తున్నారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సాక్షి టీవీ ఛానెల్‌లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు.