News15th Aug 11:01 AMSunil Byrisetty1 min read
అందాల కోనసీమ.. తెలుసా ఇవి !
కోనసీమ అనగానే పచ్చటి ప్రకృతి కళ్ళముందు కదలాడుతుంది. అసలు కోనసీమ అంటే మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం. కోనసీమ డెల్టా చుట్టూ, రెండు వైపులా గోదావరి పాయలైన వృద్ధ గోదావరి
కోనసీమ అనగానే పచ్చటి ప్రకృతి కళ్ళముందు కదలాడుతుంది. అసలు కోనసీమ అంటే మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం. కోనసీమ డెల్టా చుట్టూ, రెండు వైపులా గోదావరి పాయలైన వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు వున్నాయి. ఒక ప్రక్క సముద్రం ఉంది, రాజమండ్రి నగరాన్ని దాటిన తరువాత గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి పాయలుగా చీలుతుంది. వృద్ధ గోదావరి గౌతమి, నీలరేవుగా, వశిష్ట గోదావరి వశిష్ట, వైనతేయ గా చీలుతుంది. ఈ పాయలు బంగాళాఖాతం తీరంలో170 కి.మీ పొడవైన పరివాహక ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. దీనినే కోనసీమ ప్రాంతం అంటారు.
కోనసీమలో అమలాపురం అతి పెద్ద పట్టణం. దీని తరువాత స్థాయిలో రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం వున్నాయి.