Entertainment12th Nov 01:49 PMSunil Byrisetty1 min read

నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణ!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు క్షమాపణలు తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద, అభ్యంతర వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో జర

నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణ!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు క్షమాపణలు తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద, అభ్యంతర వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన సంచలన వివాదంలో తాను చేసిన వ్యాఖ్యలు “అనుకోకుండా” చేసినవని.. అవి నాగార్జున లేదా అతని కుటుంబ సభ్యులకు బాధ కలిగించేలా ఉన్నందున క్షమాపణ చెబుతున్నానన్నారు. ఈ పోస్ట్‌లో మంత్రి తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. 2024 అక్టోబర్ 1న కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమంతనూ ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున కోర్టుకెళ్లారు. వంద కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు. కేటీఆర్ కూడా పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణలకు హాజరైన నాగార్జున కుటుంబసభ్యులు, వాంగ్మూలాలు ఇచ్చారు. కోర్టులో వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందన్న కారణంగా కొండా సురేఖ రాత్రికి రాత్రి క్షమాపణలు చెప్పారు.
Tollywood
Political News
Konda Surekha
Nagarjuna
Apology
Telangana
Controversy
Defamation Case
Samantha
KTR
BRS
Court
నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణ
Scroll for the next article