Telangana3rd Sep 03:33 PMSunil Byrisetty1 min read
కుమార్తె దెబ్బకు కదిలిన కొండా.. తప్పని రాజీనామా!
కుమార్తె దెబ్బకు మంత్రి పదవి కదిలింది. తెలంగాణ అటవీశాఖ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు హైకమాండ్ అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఆమె మాజీగా మారబోతున్నారు. మంత్రి కుమార్తె సుస్
కుమార్తె దెబ్బకు మంత్రి పదవి కదిలింది. తెలంగాణ అటవీశాఖ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు హైకమాండ్ అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఆమె మాజీగా మారబోతున్నారు. మంత్రి కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు సురేఖను రాజీనామా చేయాలని ఆదేశించింది. ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరణ ఇచ్చినప్పటికీ అధిష్టానం సంతృప్తి చెందలేదు. దీంతో నేటి సాయంత్రం వరకు రిజైన్ చేయడానికి డెడ్ లైన్ విధించారు. లేని పక్షంలో గవర్నర్ ద్వారా బర్తరఫ్ తప్పదు. దీంతో ఆమె రాజీనామాకే సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.