Telangana29th Oct 05:42 PMSunil Byrisetty1 min read

కేటీఆర్ పై వ్యాఖ్యలకు చింతిస్తున్నా

మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో తాను చేసిన నిరాధార వ్యక్తిగత వ్యాఖ్యలకు చింతిస్తూ.. వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితు

కేటీఆర్ పై వ్యాఖ్యలకు చింతిస్తున్నా
మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో తాను చేసిన నిరాధార వ్యక్తిగత వ్యాఖ్యలకు చింతిస్తూ.. వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. ఆనాడు చేసిన కొన్ని నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. కేటీఆర్ ని గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే చింతిస్తూ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే కోర్టు కేసుల ముప్పు తప్పించుకునే ఉద్దేశంతోనే ఆమె ఉపసంహరించుకున్నారని భావిస్తున్నారు. గతంలో సినీ నటులు నాగచైతన్య, సమంతల విడాకుల అంశాన్ని, డ్రగ్స్ వ్యవహారాలను ముడిపెడుతూ కేటీఆర్‌తో పాటు అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కేటీఆర్.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఆమెపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు కోర్టు తీర్పుల నుంచి రక్షణ పొందేందుకే సురేఖ ఈ ఉపసంహరణను తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు.
Scroll for the next article