News28th Jan 05:29 PMSunil Byrisetty1 min read
ఫిబ్రవరి 7, 8న కొండవీడు ఉత్సవాలు
కొండవీడు ఉత్సవాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత, విశిష్టత, వైభవాలను చాటిచెప్పేలా ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహించబోతున్నామని మాజీమంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కొండవీడు ఉత్సవా
కొండవీడు ఉత్సవాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత, విశిష్టత, వైభవాలను చాటిచెప్పేలా ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహించబోతున్నామని మాజీమంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కొండవీడు ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండవీడును సందర్శించిన మాజీమంత్రి, జిల్లా కలెక్టర్ ఉత్సవాల ఏర్పాట్లు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు హెరిటేజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల తొలిరోజున ప్రత్యేక అతిథిగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ హాజరవుతారని చెప్పారు. కొండవీడు కోట కేంద్రంగా శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డిరాజులు పాలన సాగించారని, ఆనాటి ఘన కీర్తికి అద్దం పట్టేలా, నాటి చరిత్ర.. వైభవం నేటి తరాలకు తెలిసేలా ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా హెలికాఫ్టర్ రైడింగ్, బోటింగ్, హార్స్ రైడింగ్, రాక్ క్లైంబింగ్, లేజర్ షో, ఫ్లవర్ షో, శాండ్ ఆర్ట్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.