News22nd Oct 10:23 AMSunil Byrisetty1 min read
కోనేరు సెంటర్లో కోనేరు మాయమైంది!
కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రతి ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి చారిత్రక ప్రాంతాల్లో కోనేరుసెంటరు ఒకటి. 1864 నవంబరులో వచ్చిన ఉప్పెన కారణంగా 30వేల మందికిపైగా ప్రా
కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రతి ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి చారిత్రక ప్రాంతాల్లో కోనేరుసెంటరు ఒకటి. 1864 నవంబరులో వచ్చిన ఉప్పెన కారణంగా 30వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సముద్రం పట్టణంలోకి చొచ్చుకురావడంతో నీటి వనరులన్నీ ఉప్పుమయం అయ్యాయి. తాగునీటి వనరులు లేక ప్రజలు అల్లాడిపోవడంతో 1869లో అప్పటి వ్యాపారులు చందాలు వేసుకుని కొంత మొత్తాన్ని కలెక్టర్ థారన్ హిల్ కు ఇచ్చారు. ఆయన అంతే మొత్తాన్ని ప్రభుత్వం నుంచి మంజూరుచేయించి బొడ్డురాయిగా ఉన్న ప్రాంతంలో పెద్దకోనేరు తవ్వించారు.
నాగులేరు కాలువ నుంచి కృష్ణా జలాలను కోనేరుకు మళ్లించి ప్రజల దాహార్తిని తీర్చారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం జలనిలయంగా.. తర్వాత కోనేరు సెంటరుగా వాడుకలోకి వచ్చింది. కాలక్రమంలో కోనేరు కనుమరుగైపోగా.. ఆ కూడలి వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందింది.