Movies13th Jul 10:08 AMSunil Byrisetty1 min read

కోటకు ప్రముఖుల నివాళులు

ప్ర‌ముఖ‌ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవ

కోటకు ప్రముఖుల నివాళులు
ప్ర‌ముఖ‌ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. కోట శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వారంతా పేర్కొన్నారు. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Tollywood
kota srinivas Rao
KOTA SRINIVASA RAO PASSES AWAY
celebraties pay tribute
chandra babu
pawan kalyan
ys jagan
MLAs
ప్రముఖుల నివాళులు
తెలుగు సినీ రంగానికి తీరని లోటు
Scroll for the next article