News29th Dec 03:54 PMSunil Byrisetty1 min read

మంత్రి చొరవతో కోటిపల్లి రేవు పునః ప్రారంభం

డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ ద్వారమైన కోటిపల్లి రేవు ఎట్టకేలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో పునః ప్రారంభమైంది. సోమవారం కోటిపల్లి రేవు పంటును కూటమి పార్టీ

మంత్రి చొరవతో  కోటిపల్లి రేవు పునః ప్రారంభం
డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ ద్వారమైన కోటిపల్లి రేవు ఎట్టకేలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో పునః ప్రారంభమైంది. సోమవారం కోటిపల్లి రేవు పంటును కూటమి పార్టీ సీనియర్ నాయకులు సత్యం రేవు నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. గోదావరి ఉధృతి, ఇతర సాంకేతిక కారణాలవల్ల రేవు రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మంత్రి సుభాష్ సంబంధిత అధికారులతో చర్చించి రేవు పునః ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పూజలు నిర్వహించి కోటిపల్లి రేవును ప్రారంభించారు. రేవు పున: ప్రారంభంతో కోనసీమ జిల్లా అమలాపురంకు వెళ్లే వారు తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. రేవు పునః ప్రారంభమైందంటూ స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
Kotipalli Ferry
Ferry Services Resumed
Minister Vasamsetti Subhash
Labour Minister
Dr BR Ambedkar Konaseema District
రేవు రాకపోకలు
స్థానిక ప్రజలు
రవాణా సౌకర్యం
కూటమి పార్టీ
సత్యం రేవు
Scroll for the next article