Politics18th Oct 03:50 PMSunil Byrisetty1 min read
గుంటూరు మేయర్ అభ్యర్థి నామినేషన్
గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మి అపర్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో గుంటూరు నగర ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవ
గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మి అపర్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో గుంటూరు నగర ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి నగరంలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ, అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కట్టుబడి ఉన్న కోవెలమూడి కుటుంబానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో కీలకమైన గుంటూరు మేయర్ అభ్యర్థిగా లక్ష్మీ అపర్ణ నామినేషన్ దాఖలు చేశారు.