Politics21st Mar 04:33 PMSunil Byrisetty1 min read
గుంటూరు కాబోయే మేయర్ కోవెలమూడి నాని?
గుంటూరు మేయర్ పదవి టీడీపీకే దక్కనుంది. మేయర్ పదవికి వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో నెక్స్ట్ మేయర్ ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆశావహుల పేర్లలో కోవె
గుంటూరు మేయర్ పదవి టీడీపీకే దక్కనుంది.
మేయర్ పదవికి వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో నెక్స్ట్ మేయర్ ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే ఆశావహుల పేర్లలో కోవెలమూడి రవీంద్ర(నాని) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
పలువురు సీనియర్ కార్పొరేటర్లు సైతం ఆ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఇప్పటికే అధిష్ఠానం మేయర్ అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యే సీటును వదులుకోవాల్సి వచ్చినా పార్టీ కోసం నిలబడ్డారనే పేరు ఆయనకు ఉంది. దీంతో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వచ్చిన వెంటనే కౌన్సిల్ మీటింగ్ పెట్టి కొత్త మేయర్‌ను ఎన్నుకునే అవకాశముంది.