News19th Jul 02:09 PMSunil Byrisetty1 min read
కొయ్యలగూడెంలో ఇంటింటికీ తెలుగుదేశం
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో "ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1" కార్యక్రమం విజయవంతం. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి స
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో "ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1" కార్యక్రమం విజయవంతం. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మంత్రి గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని, తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. మంత్రికి గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమలతో, హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను, అభివృద్ధి అవసరాలను మంత్రి గారికి వివరించారు. కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఇంచార్జి బోరగం శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు పారేపల్లి నరేష్, కొయ్యలగూడెం సర్పంచ్ విజయ కుమారి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం మంత్రివర్యులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమై ప్రాంతీయ అభివృద్ధిపై చర్చించారు. "ప్రతి ఇంటికీ అభివృద్ధి చేర్చడం తెలుగుదేశం లక్ష్యం" అని మంత్రి పేర్కొన్నారు.