News27th Mar 11:36 AMSunil Byrisetty1 min read
హోంమంత్రితో సలహాదారు గాంధీ భేటీ
రాష్ట్రంలో నేరాల నియంత్రణ, పరిష్కారం కోసం ఫోరెన్సి్క్ రంగాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో ఆ రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. అందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి చెందిన ప్రముఖ శాస్త్రవే
రాష్ట్రంలో నేరాల నియంత్రణ, పరిష్కారం కోసం ఫోరెన్సి్క్ రంగాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో ఆ రంగాన్ని బలోపేతం చేస్తున్నారు.
అందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కేపీసీ గాంధీని సలహాదారుగా నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
సలహాదారుగా నియమితులైన అనంతరం హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు.
కేబినెట్ హోదాలో ఆయన సలహాదారుగా నియమితులైన సందర్భంగా అనితతో పలు అంశాలపై చర్చించారు.
ఫోరెన్సిక్ సామర్థ్యాలను బలోపేతం చేయడం, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.
ఏపీలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా చేపట్టాల్సిన బాధ్యతలపై మాట్లాడారు.