Telangana8th Aug 04:50 PMSunil Byrisetty1 min read
తెలంగాణ ఎత్తిపోతలతో కృష్ణడెల్టా ఎడారి
రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరుకు అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. కృ
రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరుకు అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. కృష్ణానదిపై సూర్యాపేట వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకం అక్రమమని, ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ వాటా నీటిని దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణాడెల్టా ప్రాంతం వేలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాదిమందికి త్రాగునీరు అందక ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మౌనాన్ని వీడి వివాదస్పాదమైన ఈ ప్రాజెక్టుపై రెండు ప్రభుత్వాలు చర్చించుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి మేరకు 95 శాతం పనులు పూర్తి చేసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తిరోగమనంవైపు తీసుకెళ్లారని తెలిపారు. ఇదే కోవలో ఒరిస్సా ప్రభుత్వం నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్రకు తీరని నష్టం వాటిల్లితోందని, లక్షలాది ఎకరాలు, లక్షలాదిమందికి సాగునీరు, త్రాగునీరు కూడా కరవవుతుందని తెలిపారు.