News24th Jan 02:46 PMSunil Byrisetty1 min read
స్వచ్ఛ జిల్లా లక్ష్య సాధనకు కృషి
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వచ్ఛ జిల్లా లక్ష్య సాధనకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ని
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వచ్ఛ జిల్లా లక్ష్య సాధనకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించిన ఆయన పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. కార్యాలయ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పది సూత్రాలు రూపొందించిందని, అందులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఒకటని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లాలో ప్రతి నెలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ విధంగా ప్రతి నెలలో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఎంచుకుని, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి శుభ్రం చేస్తూ ముందుకెళ్తున్నామని, నేడు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశామన్నారు.