News24th May 02:32 PMSunil Byrisetty1 min read
పగలు కొత్తిమీర, కరివేపాకు.. రాత్రిళ్లు చోరీలు!
పగలు కొత్తిమీర కరివేపాకు అమ్ముతూ.. రాత్రిళ్ళు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ వెల్లడించ
పగలు కొత్తిమీర కరివేపాకు అమ్ముతూ.. రాత్రిళ్ళు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
కేసు వివరాలను గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ వెల్లడించారు.
పమిడిముక్కల, కూచిపూడి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ముఠా సభ్యులను పట్టుకున్నారు.
వారి వద్ద 3 లక్షల విలువైన 26 గ్రాముల బంగారం, 562 గ్రాముల వెండి, రూ. 3500 నగదు, రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు.
ముఠా సభ్యులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, నిందితుల్లో ఒకరు మైనర్ కావడం విశేషమన్నారు.
పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్ముతున్నట్లు ఊర్లలో తిరుగుతూ, తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రిళ్ళు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ తెలియజేశారు.