News23rd Dec 05:02 PMSunil Byrisetty1 min read
ఎంపీని కలిసిన కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్షుడు గురుమూర్తి
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన రాష్ట్ర గౌడ సంక్షేమ,అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాద ప
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన రాష్ట్ర గౌడ సంక్షేమ,అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన వీరంకి వెంకట గురుమూర్తి కి ఎంపీ కేశినేని శివనాథ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వీరంకి గురుమూర్తిని ఎంపీ కేశినేని శివనాథ్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలపారు. అనంతరం వీరిరువురు రాష్ట్ర,ఉమ్మడి కృష్ణాజిల్లాల రాజకీయాలపై కాసేపు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు.